రేపు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ కీ విడుదల …

తెలంగాణవ్యాప్తంగా ఖాళీగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ఇటీవల తుది విడుత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మే 22 న కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం వెబ్‌సైట్‌లో కానిస్టేబుల్‌ సివిల్‌, పీసీ డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్‌, ఐటీ తత్సమాన పోస్టులకు సంబంధించిన ఫైనల్‌ కీ tslprb.inలో కీని ఉంచనున్నట్లు వెల్లడించింది. అభ్యంతరాలు మే 24 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని సూచించింది.

అభ్యంతరాలకు ప్రత్యేకంగా ప్రోఫార్మా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. ఫైనల్‌ కీని విడుదల చేసే సమయంలో ఓఎంఆర్‌ షీట్లు లాగిన్‌లో ఉంచనున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల 30న తుది విడుత రాత పరీక్షలు నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 1,09,663 మంది అర్హత సాధించగా.. ఇందులో 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారు…