కేతేపల్లిలో తృటిలో తప్పిన ప్రమాదం..పోలీసు వాహనం టైరు పగిలి డివైడర్ను ఢీ కొట్టి పల్టీ..

నల్గొండ జిల్లా..

కేతేపల్లిలో తృటిలో తప్పిన ప్రమాదం..
కేతేపల్లి మండల పరిధిలోని జాతీయ రహదారి పై పోలీసు వాహనం టైరు పగిలి డివైడర్ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. సూర్యాపేటలోని నిందితున్ని హైదరాబాద్ కోర్టులో హాజరపరిచి రాచకొండ హెడ్ ఆఫీస్ నుండి నిందితున్ని తీసుకుని సూర్యాపేటకు వెళ్తున్న క్రమంలో కేతేపల్లి కేంద్రంలోని మేరీ మాత చర్చి ముందు ఆ పోలీస్ వాహనం టైరు బరస్టు అయి కారు పల్టీకొట్టింది.

ఆ కారు లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక హెడ్ కానిస్టేబుల్ డ్రైవర్ ఉన్నారు. ఇద్దరు కానిస్టేబులకు గాయాలు అయ్యాయి.వారిని సూర్యాపేటకు తరలించి కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

గాయపడిన క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లుగా ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ధ్వంసమైన పోలీస్ వాహనాన్ని పెద్ద పెళ్లి పోలీస్ స్టేషన్ కి తరలించినట్లుగా ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు..