*ఇంతకీ అ నలుగురు*
*కోవర్ట్ లు ఎవరు..?
తెలంగాణ బీజేపీ(bjp) నేతలు ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఒకరికొకరు పడట్లేదనో.. గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయనో.. ప్రెస్‌మీట్‌లతో ఇలా కమలనాథులు ఎప్పుడూ వార్తల్లో నానుతుంటారు. ఇవన్నీ పక్కనెడితే ఇప్పుడు బీజేపీలో ‘కోవర్టు’ రాజకీయాలు(political) ఎక్కవైపోయాయన్నది రాష్ట్ర కమలనాథులను అయోమయం కలిగిస్తున్న విషయం. వాస్తవానికి చాలా రోజులుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. సీఎం కేసీఆర్‌కు(KCR) అన్ని పార్టీల్లో ముఖ్యంగా బీజేపీలో ఎక్కువమంది కోవర్టులు ఉన్నారన్నట్లుగా అప్పట్లోనే సంచలన ప్రకటన చేశారు. నాటి నుంచి నేటి వరకూ ఎవరనేది మాత్రం బయటికి పొక్కలేదు కానీ.. తాజాగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్(nandishwar Goud) కూడా ఇలాగే కామెంట్స్ చేయడం మరో 15 రోజుల్లో మీడియా ఆ నలుగురు పేర్లు బట్టబయలు చేస్తానని ప్రకటించడం పెను సంచలనమైంది. దీంతో ఆ నలుగురు ఎవరబ్బా..? బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే ఇలా చేస్తున్నారా..? లేకుంటే కేసీఆర్ పనిగట్టుకుని మరీ బీజేపీ అంతర్గత వ్యవహారాలు కనుక్కోవడానికి పంపారా..? అనేది తేల్చే పనిలో అధిష్టానం ఉందట.
*ఇందులో నిజమెంత..!?*
బీజేపీ అతిపెద్ద జాతీయ పార్టీ.. మహాసముద్రం లాంటిది.. నలుమూలలా ఎప్పుడేం జరిగినా గల్లీ నుంచి ఢిల్లీకి సమాచారం చేరిపోతుంటుంది. చీమ చిటుక్కుమన్నా అగ్రనేతలు తెలిసిపోయే పరిస్థితుల్లో తెలంగాణలో కోవర్టులు ఉన్నారన్న వార్త అంత నమ్మశక్యంగా లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే.. అదేమీ లేదు ఇంతవరకూ పార్టీకి సంబంధించిన విషయాలు పిన్ టూ పిన్ అధికార పార్టీకి కొందరు చేరవేశారు.. కోవర్టులు ఉన్నారన్న మాట అక్షరాలా నిజమేనన్నది కమలనాథుల్లో లోలోపల జరుగుతున్న చర్చట. పోనీ.. ఈ కోవర్టుల గురించి ప్రస్తావన తెచ్చిన నేతలు ఏమైనా చిన్నవారా అంటే అదేమీ కాదు.. రాజకీయాల్లో పండిపోయిన సీనియర్లే కావడంతో ఈ విషయాన్ని అంత ఈజీగా కొట్టేయలేని పరిస్థితి. అయితే ఇంతవరకూ ఈ కోవర్టులు అధికార పార్టీకి సర్వేలతో పాటు అత్యంత రహస్య సమాచారం చేరవేసినట్లుగా చర్చ నడుస్తోంది. నందీశ్వర్ గౌడ్.. పేర్లు బయటపెడతానని ప్రకటించడం, దమ్ముంటే పార్టీని వీడి వెళ్లాలని లేకుంటే బట్టలూడదీసి కొడతాననడంతో తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోందో తెలియక కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఇప్పుడిదే సర్వత్రా ఆసకిగా మారింది. అయితే ఈ ప్రకటన చేసి 24 గంటలు దాటినా ఇంతవరకూ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అయితే నందీశ్వర్ పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు గనుకే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. నలుగురున్న మాట నిజమైతే అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది…………….