రాజకీయ ఒత్తిళ్లకు బలి. అవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు.?!

ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినకపోతే..?

ఎలక్షన్ కంటే ముందు పార్టి మరి, ప్రస్తుత అధికార పార్టీ లోకి వచ్చిన సర్పంచ్ లు, నాయకుల కనుసైగల్లో పనిచేసిన వారిపై ఎంక్వైరీ లేదా..!?.

ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినకపోతే..?..

ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభావిత వర్గం. వారిని మంచి చేసుకోకపోతే ఎంతటి పాలకులకు అయినా చుక్కలు కనిపిస్తాయి…

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేశారంటూ కొందరిపై అభియోగాలతో ప్రస్తుతం ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది,, ఇందులో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా,

తెలంగణలోనే పలు నియోజకవర్గాల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం కొంత వేధింపులకు గురిచేస్తుందంటూ ఉద్యోగుల్లో ఆందోళన… . గత పాలకులకు అత్యంత సన్నిహితంగా ఉన్నారంటూ ఏ చిన్న కారణం దొరికిన ఆ ఉద్యోగులని ఎంక్వయిరీ అనే పేరు తోటి ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేసి మూడో రోజు వెంటనే సస్పెండ్ అనే లెటర్ ని పంపిస్తున్నారు..! ఇప్పటికే పోలీస్ శాఖలో పదుల సంఖ్యలో సస్పెన్షన్‌కు గురయ్యారు… ప్రస్తుతం గ్రామ పంచాయతీలలో రికార్డులు స్వాధీన పరుచుకుని, సర్పంచ్ లాపై కోపంతో కార్యదర్శులపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ ఆ ఉద్యోగులలో ఆందోళన మొదలవుతుంది..!… ఉద్యోగుల పరిస్తితి . మింగమంటే కప్పకు కోపం కక్కమంటే పాముకు కోపం ఇలా తయారైంది ఉద్యోగస్తుల పరిస్థితి,, అప్పుడు అధికారిక ప్రభుత్వ వారు చెప్పినట్లు వినకపోతే రాజకీయ ఒత్తిళ్ల తప్పలేదు… అది కూడా నిబంధనలకు తగినట్లే తలొగ్గి నిబంధనలకు పనులు చేస్తే ప్రస్తుతం వారి రాజకీయ స్వలాభాల కోసం,, ఇరు పార్టీల మధ్యన ఉన్న వ్యక్తిగత కోపాలతో తాము బలి అవ్వాల్సి వస్తుంది అంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..!!. మరికొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడి సస్పెండ్‌ అయ్యారు….

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొంతమంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండొచ్చు అనే నెపంతో తరువాత వచ్చే ప్రభుత్వం వారు వీరిని కూడా కక్ష సాధింపు చేస్తే పరిస్థితి ఏమిటి అంటు కొందరు ఉద్యోగులలో వ్యక్తం అవుతున్న సందేహాలు.. ఇలా రాజకీయ కక్షలకి ఉద్యోగులు బలవుతున్నారా..!? నిజంగా ఇలానే పరిస్తితి కొనసాగితే ఉద్యోగులు ఉద్యోగం చేయగలమా..!. అనే ఆలోచన కూడా ఉద్యోగుల్లో మొదలవుతుంది… ఈరోజు వారి వంతు రేపు మన దాకా వస్తే పరిస్థితి ఏమిటని మరికొందరి మదిలో మెదులుతున్న ఆలోచనలు,,!. ఇలానే కొనసాగితే ఉద్యోగులలో ప్రభుత్వాల పట్ల రాజకీయ నాయకుల పట్ల కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు..!. కక్ష సాధింపు ధోరణిలతో రాజకీయాలు చేస్తే ఉద్యోగుల పట్ల వారు ఉద్యోగాన్ని స్వేచ్ఛగా చేయగలరా ఇది ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి.. ఎటువంటి రాజకీయ ఒత్తులు లేకుండా ప్రభుత్వం ఉద్యోగులను పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా చేయగలిగినప్పుడు మాత్రమే అవినీతికి ఆస్కారం లేకుండా పనులు జరుగుతూ ఉంటాయి,.. కిందిస్థాయి నాయకులు పైరవీల పేరుతో డబ్బులు దండుకుంటూ ఉంటారు.. ఆ పనులు చేయకపోతే కూడా ఉద్యోగులపైనే ఒత్తిడి తెస్తారు.. ఆ పని నీతివంతమైనదా అవినీతివంతమైనదా అని ఆలోచించుకోవడానికి కూడా పై స్థాయి నాయకులకు సమయం ఉండదు,, మావాడు వస్తాడు పనిచేసి పెట్టండి అంటూ అధికారులకి ఫోన్లు చేసి ఒత్తిడికి గురి చేస్తుంటారు… ఒకటికి రెండుసార్లు ఆ పని కాకపోతే ఉద్యోగస్తుడు పై అధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెప్పించి పని చేయించుకుంటారు…. ఇదే తరహాలో తర్వాత వస్తున్న ప్రభుత్వాలు వీటిపై ఎంక్వయిరీ అంటూ ఉద్యోగస్తులు బలి చేస్తున్నారు… ఐదు సంవత్సరాలు ఉండిపోయే నాయకుల కోసం 50 సంవత్సరాల సర్వీస్ కలిగిన ఉద్యోగస్తులు బలవుతున్నారనే ఆలోచన ఇప్పుడు సర్వత్ర వ్యక్తమౌతుంది..!. ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరిచి ప్రత్యర్ధులపై వారికున్న కోపాన్ని నేరుగా వారితోటే వ్యక్తపరచుకోవాలని అంతేకానీ ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు సరికాదు అంటూ విన్నవించుకుంటున్నారు ఇలానే ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే,, ఉద్యోగులు కూడా స్వేచ్ఛగా ఉద్యోగం చేయలేరని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినకపోతే..?*

ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినకపోతే మీరు కూడా అలాగనే చూసి చూడనట్టు వెళ్తారా..!? ఆ పని ఎందుకు చేయవు అంటూ ఉద్యోగిపై ఒత్తిడి తెస్తారా లేదా… ఉద్యోగికి ఎలా అయిన ఒత్తిడి తప్పదు… వారికి కావాల్సింది కేవలం వారి పని మాత్రమే మేము అధికార పార్టీలో ఉన్న మాకెందుకు చేయవు అని అంటారు… చెయ్యకపోతే ట్రాన్స్ఫర్ చేస్తే సస్పెండ్ లు…. ఇలానే ఉంటుంది ఉద్యోగుల పరిస్థితి..! కొంతమంది నిజాయితీగా ఉన్న వారికి ట్రాన్స్ఫర్ ఎక్కువ.. చూసి చూడనట్లు వెళ్లే వారికి అధికార పార్టీకి కొమ్ముకాసే అంటూ అధికార పార్టీలు మారినప్పుడు ఒత్తిడి ఎదురుకోక తప్పదు..!..

ఉద్యోగుల వ్యక్తం అవుతున్న ఆందోళన..!!

తాము ఎవరికీ చుట్టాలు కాదని అధికార పార్టీ ఒత్తిడికి కొన్ని పనులు నిబంధనలకు అటు ఇటు అయినా చేయాల్సి వచ్చిందని,, అలా చేయకపోతే వారు వేధించేవారు,, చేస్తే ఇప్పుడు వీరు వేధిస్తున్నారు… వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన వారు, ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేయడం ఎంతవరకు సమన్యాసము ఆలోచించుకోవాలని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…… తాము ఎవరికైనా ఎప్పటికైనా నిబంధనలకు లోబడి పనులు చేసావే తప్ప అందులో ఎటువంటి వ్యక్తిగత లాభాపేక్షలు ఉండవని భావిస్తున్నట్లు తెలిపారు….. నీలా ఎంక్వయిరీ పేరిట ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం వల్ల అటు ఉద్యోగుల్లో వారి కుటుంబీకులలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు..