పొంగులేటి, జూపల్లితో ఈటల భేటీ..!

బీఆర్ఎస్‌ నుండి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లితో ఈటల చర్చలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో..దాదాపు ఐదుగంటల నుంచి సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీలో చేరాలని ఆ ఇద్దరి నేతలను మరోసారి ఈటల కోరినట్లు తెలుస్తోంది.. అలాగే ఇటీవల హైకమాండ్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని పొంగులేటి, జూపల్లికి వివరిస్తున్నట్లు సమాచారం…

హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌ హౌస్‌ లో దాదాపు నాలుగు గంటల సేపు చర్చలు జరిగాయి. గన్‌ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలంతా ఒకేచోటకు వచ్చి కలవడం విశేషం.

ఇటీవల ఖమ్మంలో పొంగులేటి నివాసానికి వెళ్లిన బీజేపీ నేతలు.. పొంగులేటితోపాటు, జూపల్లి కృష్ణారావుతోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే చర్చల తర్వాత ఇద్దరూ మాట దాటవేశారు. ఎన్నికలకింకా సమయం ఉందని, ఏ పార్టీలో చేరాలనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని వారిద్దరూ ప్రకటించారు. తక్కువ సమయంలోనే మరోసారి వీరిద్దరితో ఈటల భేటీ కావడం విశేషం. జూపల్లి, పొంగులేటిని బీజేపీలోకి తేవాలని ఈటల చూస్తుంటే.. ఈటలతో సహా అందరూ కాంగ్రెస్ లోకి వచ్చేయండని రేవంత్ రెడ్డి ఆఫర్ ఇస్తున్నారు. ఎన్నికలనాటికి అసలు ఎవరు ఏపార్టీలో ఉంటారో, ఎవరితో పోటీపడతారో అనేది ఆసక్తిగా మారింది..