తనతో పాటు తన వర్గం నేతలకు 6 టిక్కెట్లు అడిగిన పొంగులేటి..

తనతో పాటు తన వర్గం నేతలకు 6 టిక్కెట్లు అడిగిన పొంగులేటి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కడమే కాదు వ్యూహాత్మకమూ అవుతోంది. త్రిముఖ పోరు ఖాయమన్న అభిప్రాయం మొన్నటి వరకు వున్నా ఇపుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ముఖాముఖి పోరు వుండబోతుందా అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కర్నాటక ఫలితాలతో ఆవహించిన నిరాశ, నిస్పృహలతో కమల నాథులు గత మూడు వారాలుగా స్తబ్ధుగా మారిపోయారు. బీజేపీ యాక్టివిటీస్‌ కూడా బాగా తగ్గాయి. ..

బీజేపీ అగ్ర నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. వీరి పర్యటన తెలంగాణలో బీజేపీని తిరిగి బరిలోకి తెచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలదే దూకుడు అనిపించేలా పరిస్థితి కనిపిస్తోంది..

ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లొ చేరికతో ఆ పార్టీలో జోష్ వచ్చింది… ఇదంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లు హడావుడి మొదలైంది.. అధికారం బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో,, కొంత అసంతృప్తి సెగలు వెల్లడైతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వెల్లడించబోతుందన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది..

తనతో పాటు తన వర్గం నేతలకు 6 టిక్కెట్లు అడిగిన పొంగులేటి..

ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన వర్గం నేతలకు టిక్కెట్లు అడిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవి కాకుండా వనపర్తిలో తుడి మేఘా రెడ్డికి సైతం పొంగులేటి టికెట్ అడిగినట్లు సమాచారం… ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి….