పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి ఖమ్మంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

నేడు నామినేషన్‌ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన నివాసంపై ఐటీ దాడులు జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గురువారం వేకువజామున ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు రావడం గమనార్హం…
ఇదిలావుండగా ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై, తన కుంటుంబ సభ్యుల ఇళ్లలో, తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో పొంగులేటి అన్నారు. రోజుల వ్యవధిలో ఇది చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. కాగా గురువారం ఆయన నామినేషన్ వేయాలని భావించారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది వేచిచూడాలి.