పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు..నేడు రాహుల్ గాంధీ తో భేటీ..

బీఆర్ఎస్ బహిష్కృత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు సోమవారం రాహుల్ గాంధీ తో భేటీ కానున్నారు. ఒక రోజు ముందే ఇరువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. వేర్వేరు హోటళ్లలో మకాం వేశారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు సుమారు 40 మంది, జూపల్లితో పాటు మరో 10 మంది ముఖ్య అనుచరులు హస్తినకు చేరుకున్నారు. రేవంత్‌తో కలసి ఇరువురు నేతలు తొలుత రాహుల్గాంధీని కలవనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ఖర్గే, ప్రియాంక గాంధీలతో భేటీ కానున్నారు.
పార్టీ చేరికల తేదీ బహిరంగ సమావేశాలు వంటి వాటిపై చర్చించిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పొంగులేటి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాహుల్సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్కండువా కప్పుకోవాలని టీపీసీసీ పొంగులేటి, జూపల్లిలను కోరింది. అయితే ఆ ఇరువురు నేతలు సొంత జిల్లాల్లో కార్యకర్తలు, అభిమానులు మధ్య చేరాలని ఆసక్తితో ఉన్నారు. వీరి చేరిక తర్వాత ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను కూడా గుంజేందుకు కాంగ్రెస్పార్టీ వ్యూహాలను అల్లుతుంది. ఢిల్లీలోనే ఉన్న ఆ ఇరువురి నేతలను పార్టీ హైకమాండ్ టచ్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.