టీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి….కీలక వ్యాఖ్యలు…
కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ కూర్చునే అంత అసమర్థుడను కాదని పొంగులేటి కీలక కామెంట్స్ చేశారు. అధికారం శాశ్వతం కాదని ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధులు గెలుపు కోసం ఎవరు పని చేశారో ప్రజలకు తెలుసు అని కీలక వ్యాఖ్యలు. ఖమ్మం జిల్లా వేంసూరు మండల పర్యటనలో కొంత మంది ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు పొంగులేటి కి తాము పడుతున్న ఇబ్బందుల పై ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధుల పై కక్ష్య పూరితం గా వ్యవహరిస్తున్నారు అని..అధికారం శాశ్వతం కాదు అని నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అధైర్యపడల్సిన అవసరం లేదు అన్నారు. నేడు పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ చెట్టు నీడలో ఉన్నవారే అని ప్రజా అభిమానమే తమకు పెద్ద పదవులు అని అన్నారు. పదవి రావాలి అన్నప్పుడు, పదవిని భగవంతుడు ఇవ్వాలి అన్నప్పుడు ఎవరు అడ్డు పడ్డా ఆ పదవి ఆగదు అని అన్నారు. అదేవిధంగా పదవి పోయే టైం వచ్చినప్పుడు ఎవరు అడ్డుపడ్డ ఆగదు అని ఇది వేదాంతం కోసం చెప్పేది కాదు కానీ పదవులు ఎవడబ్బ సొత్తు కాదని తాను మొదటినుంచి చెప్తున్నా అని అన్నారు.