పొన్నాల లక్ష్మయ్యకు రాహుల్ గాంధీ కార్యాలయం నుండి ఫోన్..!!?.. రియాక్షన్ ఇలా ఉందా..!!!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు అధిక శాతం ఉండడంతో అటువైపుగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తోంది. గత కొంతకాలంగా పార్టీ మీద అసంతృప్తితో మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaiah ) కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే పొన్నాలను ఎలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు ఢిల్లీ అధిష్ఠానం పలు ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ బీసీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు.

ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి తిరిగి రావాలని రాహుల్ గాంధీ కోరినట్లు విశ్వాసనీయ సమాచారం. రాహుల్ గాంధీ అభ్యర్థనును పొన్నాల తిరస్కరించినట్లు తెలుస్తోంది. గతంలో బీసీ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని రాహుల్ గాంధీ కార్యాలయానికి ఈరోజు బీసీలు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవారిని కనీసం పట్టించుకోని రాహుల్ గాంధీ కార్యాలయానికి పార్టీని వీడిన తర్వాత బీసీలు గుర్తుకు వచ్చారా అంటూ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.