కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎన్నికల పై ఫోకస్ చేయలేదు.. హుజురాబాద్ ఎన్నికలతో కాంగ్రెస్ లో విబేధాలు. ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి….పొన్నం ప్రభాకర్..

హుజూరాబాద్‌లో ముందుగా ఊహించిన ఫలితాలే వచ్చినట్లు పేర్కొన్నారు.

మాజీ TPCC ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కి కౌశిక్ రెడ్డి పై చూపిన ప్రేమే సగం కొంప ముంచింది.. పొన్నం..

హుజురాబాద్ లో జరిగిన ఎన్నికల ను హై కమాండ్ వివరిస్తాం.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..

ఇది ఈటల రాజేందర్ విజయమే తప్ప.. బీజేపీ విజయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు బీజేపీ విజయంగా బండి సంజయ్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తీరు సరికాదని నియోజకవర్గ ప్రజలు భావించినట్లు పేర్కొన్నారు. అలాగే హుజూరాబాద్‌ పోరు టీఆర్ఎస్ ప్రభుత్వం వర్సస్ ఈటల రాజేందర్ సానుభూతిగా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు…బీజేపీ నేతలు దుబ్బాకలో పనిచేసినట్లు.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ కోసం గట్టిగా పనిచేయలేదని పొన్నం ప్రభాకర్…కాంగ్రెస్ అధిష్టానం ఇకనైనా బహిరంగ సభల ద్వారా ఓట్లు వస్తాయనుకుంటే పొరబాటేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు…

ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..

హుజూరాబాద్లో ఎలక్షన్స్ నడుస్తుంటే ఎక్కడెక్కడో కార్యక్రమాలు చేసి హుజురాబాద్ సరిగా కాన్సన్ ట్రేషన్ చేయలేదు…. దీన్ని హైకమాండ్ వివరిస్తా అందర్నీ కలుపుకొని వెళ్ళక పోవడం వల్లే ఇంత ఘోరమైన పరాజయాన్ని చవి చూస్తున్నాం…