కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. రాజీనామా…

కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. రాజీనామా తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. రాజీనామా చేశా… ఇంకా చెప్పాల్సిందేమీ లేదన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి.. ఈస్థాయికి చేరుకున్నానన్నారు. 45 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమేనన్న పొన్నాల.. కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారన్నారు. కొందరు నేతల వల్ల కాంగ్రెస్‌ పరువు పోతుందని.. పార్టీలో అవమానం జరగడం వల్లే రాజీనామా చేశానని వెల్లడించారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అనేది అందరికీ తెలిసిందేనన్నారు. కొంతమంది నాయకులకే పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందన్నారు పొన్నాల లక్ష్మయ్య.