పొన్నూరులో కీచక అవతారమెత్తిన ఉపాధ్యాయుడు..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచక అవతారమెత్తాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర‌్తించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిషత్ పాఠశాలలో ఈరోజు చోటుచేసుకుంది.

చిన్నారులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. పాఠశాలలో ఆందోళనకు దిగారు. విద్యార్థుల కుటుంబసభ్యులు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా ఎంఈవో పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు.. నజీర్‌‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.