బ్రాహ్మణి వ్యాఖ్యలకు పోసాని కృష్ణమురళి కౌంటర్..!

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జెల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్రమంగా నిబంధనలకు విరుద్దంగా వందల కోట్ల రూపాయలను కాజేసి చాకచక్యంగా తప్పించుకోబోయి అడ్డంగా దొరికిపోయారు బాబు. ఏపీ సీఐడీ సెప్టెంబర్ 9న నంద్యాలలో బాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ అరెస్టుపై టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యలు నిరసన కార్యక్రమంలు చేపడుతున్నారు… బాబు ఏ తప్పు చేయకున్నా రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారంటూ నానా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నారావారి కోడలు నారా బ్రాహ్మణి రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు అరెస్టు అక్రమమని, 40 ఏళ్లుగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ బ్రాహ్మణి తెలిపింది. కాగా బ్రాహ్మణి వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు..

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి చంద్రబాబు అరెస్ట్ అంశంపై ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో చంద్రబాబు అరెస్ట్ గురించిమాట్లాడి, చంద్రబాబు ని విమర్శించి, చంద్రబాబుపై సెటైర్లు వేశారు. అనంతరం నారా బ్రాహ్మణిపై కూడా కౌంటర్లు వేశారు పోసాని.

APFDC చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో. బ్రాహ్మణి నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు, మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు, మీ తాతయ్యను చంపిందెవరు, జగన్ దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను మీ మామయ్య ఎందుకు కొన్నారు. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతా అని అన్నారు. దీంతో పోసాని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మీ తాతను చెప్పులు విసిరేసి కూడా దర్జాగా రాజ్యమేలుతున్న వ్యక్తిని ఇంకా నువ్వు గొప్పోడు అంటున్నావ్ అంటే మీ తాత పై మీకున్న ప్రేమ ఎలాంటిదో మాకు అర్థమైంది అంటూ కూడా సెటైర్లు వేశారు..