పోస్టల్‌ విభాగంలొ దేశవ్యాప్తంగా ఈ కింది పోస్టుల భర్తీ…

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రామీణ్‌ డాక్‌సేవక్‌ పోస్టులు (బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌సేవక్‌)

మొత్తం ఖాళీలు: 38,926

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ-1226, ఆంధ్రప్రదేశ్‌-1716.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. సిస్టమ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలినవారు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 05.

వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో…

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రెయినింగ్‌ మేనేజర్లు

మొత్తం ఖాళీలు: 15 అర్హత: ఏదైనా పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 13.

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

డీఎంహెచ్‌ఓ, రంగారెడ్డిలో…

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 13

పోస్టులు: మెడికల్‌ ఆఫీసర్లు, సైకాలజిస్ట్‌, స్టాఫ్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, జీఎన్‌ఎం, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, వయసు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 09.

వెబ్‌సైట్‌: https://rangareddy.telangana.gov.in/

ప్రవేశాలు
ఇఫ్లూ, హైదరాబాద్‌లో…

కేంద్రీయ విశ్వవిద్యాలయమైన హైదరాబాద్‌లోని ది ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) 2022-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ప్రోగ్రాములు

1) పీజీ డిప్లొమా ప్రోగ్రాములు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ద టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (పీజీడీటీఈ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ద టీచింగ్‌ ఆఫ్‌ అరబిక్‌ (పీజీడీటీఏ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ద టీచింగ్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ (పీజీడీటీ)

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ ఉత్తీర్ణత.

2) పీహెచ్‌డీ ప్రోగ్రాములు: లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ ఎంఫిల్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష తేది: 2022, జూన్‌ 04.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 18.

వెబ్‌సైట్‌: ‌www.efluniversity.ac.in/