విభేదాలపై క్లారిటీ ఇచ్చిన పూజా, ప్రభాస్.. వివాదాలకు పులిస్టాప్ పడినట్లేనా..!!!

యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్, స్టార్ హిరోయిన్ పూజా హెగ్డే ల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని సోష‌ల్ మీడియాలో పుకార్లు వ‌చ్చాయి. వీరు కలిసి న‌టిస్తున్న రాధేశ్యామ్ సినిమాలోనూ ఎడ మొహం పెడ మొహం పెట్టుకుని ఉంటున్నార‌ని వార్తలు వ‌చ్చాయి. అంతే కాదు.. వీరు క‌లిసి న‌టించ‌డం లేద‌ని విడి విడిగా షూటింగ్ ల‌లో పాల్గోంటున్నార‌ని పుక‌ర్లు షికార్లు చేశాయి. మొద‌ట్లో హిరో ప్ర‌భాస్ గానీ, హిరోయిన్ పూజా హెగ్డే కానీ ఈ పుకార్ల పై స్పంధించ‌క పోవ‌డంతో ఈ వార్త‌లు అడ్డు అదుపు లేకుండా వ‌చ్చాయి….
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు..ఇటీవలే ప్రకటించారు.ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది…అందుకే రాధేశ్యామ్ కోసం డార్లింగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది…ప్రభాస్, పూజా హెగ్డే తో పాటు మేకర్స్ కూడా పాల్గొన్నారు.గత కొద్దీ రోజులుగా ప్రభాస్, పూజా లపై రూమర్స్ వస్తున్నాయి.
వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే మాట్లాడుకోవడం లేదని ప్రచారాం జరుగుతుంది.ఆ రూమర్స్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేసారు ప్రభాస్, పూజా…ప్రమోషన్స్ లో పూజా హెగ్డే ప్రభాస్ గురించి మాట్లాడింది.ఆయనకు సిగ్గు కాస్త ఎక్కువ.అందుకే ఆయనతో కలవడానికి టైం పడుతుందని.చాలా కూల్ పర్సన్ మరొకరు లేరని పూజా చెప్పుకొచ్చింది. అలాగే ప్రభాస్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.సినిమాలో హీరోయిన్ కీలకం.అందుకే ఎంతగానో అలోచించి ప్రేరణ రోల్ కోసం పూజా హెగ్డే ను తీసుకున్నామని.
ఈ సినిమాలో ఆమెతో కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యిందని తెలిపాడు.దీంతో వీరిద్దరి మధ్య గొడవలు అంటూ వస్తున్న వార్తలు రూమర్స్ అని అర్ధం అవుతుంది.