డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ సినిమా..

ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని భాషలలో సినిమాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపును తేవడంతో భాషతో పని లేకుండా ప్రతి హీరో వారి ప్రతివను కనబరుస్తున్నారు..
దేశీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్న టాలీవుడ్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన టాలీవుడ్… ఎప్పటి నుంచో బాలీవుడ్ లో పాగా వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు మరింత ఊతం ఇచ్చే విధంగా ముందుకు సాగుతోంది. తాజా పరిణామాలతో మనోళ్లు హిందీ చిత్ర సీమలో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. ఓ భారీ మల్టీస్టారర్ తో అదిరిపోయే సినిమా తీసేందుకు సమాయత్తం అయింది. డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. పాఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సిద్ధార్ద్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. హృతిక్, ప్రభాస్ ఇద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ స్టార్స్ కలసి ఓ సినిమాలో నటిస్తున్నారు అంటేనే జనాల రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఏమైనా ప్రస్తుతం ఈ ముచ్చట ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇదే వార్త నిజమైతే ఫ్యాన్స్ కు పండగ అనడంలో సందేహమేలేదు…