చంద్రబాబు ద్రోహి,,నా భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా..ప్రభాకర్ చౌదరి.

చంద్రబాబు నాయుడు టిడిపి తుది జాబితా ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం తుది జాబితాను ప్రకటించారు.మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు 4 దశల్లో అభ్యర్థుల్ని ప్రకటించారాయన…అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు.ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ జెండాలు, చంద్రబాబు ఫొటోలు ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి తగలబెట్టారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు చంద్రబాబు ద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలు పగులగొట్టి.. ఫర్నీచర్ కంప్యూటర్లను ధ్వంసం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకుండా, డబ్బులు అమ్ముకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు..తనకు టికెట్ రాకపోవడంపై స్పందించిన ప్రభాకర్ చౌదరి.. టీడీపీ అమ్ముడుపోయిందని వ్యాఖ్యానించారు. డబ్బున్న వారికి మాత్రమే టీడీపీలో టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేశాను. సొంత ఆస్తులు అమ్ముకున్నాను.ఎవరిని అడిగి దగ్గుబాటి ప్రసాద్‌కి టికెట్ ఇచ్చారని చంద్రబాబును ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. నా భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా ప్రభాకర్ చౌదరి తెలిపారు. భవిష్యత్తులో చంద్రబాబు పిలిచిన ఆయన వద్దకు వెళ్ళనని స్పష్టం చేశారు..

గుమ్మనూరు జయరాం టికెట్ కేటాయించడంపై అభ్యంతరాలు:

ఇదిలా ఉంటే .. గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరాంకు కేటాయించడంపై కూడా టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. గుమ్మనూరు జయరాంకు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుంతకల్లు పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలకు జితేందర్ గౌడ్ వర్గీయు నిప్పు పెట్టారు. కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ద్రోహం చేసి టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు.

కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా

టీడీపీ కీలక నేత అయిన కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చీపురుపల్లి టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయనగర జిల్లా అధ్యక్ష పదవితో పాటు, చీపురుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి రాజీరనామా చేస్తున్నట్టు కిమిడి నాగార్జున తెలిపారు. విజయనగర జిల్లా అధ్యక్షుడుగా ఉన్న తనకు చీపురుపల్లి టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావు పేరును ఖారారు చేశారు. తనకు కాకుండా పెదనాన్న కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించడంతో మనస్థాపం చెందిన కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు..