సామాన్యులకు అందనంత దూరంలో అక్కడ ‘సలార్‌’ టికెట్ల రేట్లు..!!

*సినిమా అంటే వినోదమా…దోపిడీ వ్యాపరమా*

*మధ్య తరగతి ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ అంటే సినిమానే ఫస్ట్ ప్రయార్టీ..*

పెద్దగా పబ్లిసిటీ ఇవ్వలేదు.. ఈవెంట్స్ పెట్టలేదు..

టికెట్స్ ధర ఎంతో తెలుసా..? రెబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!..
సలార్‌ రన్‌టైమ్‌ 2గంటల 55నిమిషాలు ఉన్న ఈ మూవీ టికెట్‌ రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్‌ సిరీస్‌ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్స్మ్‌ సంస్థనే సలార్‌ను కూడా నిర్మించింది. అయితే తెలంగాణ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సొంతం చేసుకుంది. తాజాగా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అలాగే అదనపు షోస్‌ అనుమతి కోసం మైత్రీ మేకర్స్ అధినేతలు తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్‌ చేశారట. అలాగే రిలీజ్‌ రోజున సింగిల్‌ థియేటర్‌లో 6 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతులివ్వాలని తెలంగాణ సర్కార్‌ను కోరారట…

హైప్ క్రియేట్ చేయలేదు.. అత్యంత భారీ అంచనాలు పెంచకుండానే ధియేటర్లలోకి వచ్చిన మూవీ సలార్.. మంచి టాక్ అయితే వస్తుంది.. ఇదే సమయంలో సలార్ టికెట్ల ధరలు చూసి కళ్లు తేలేస్తున్నారు సినీ అభిమానులు..

సింగిల్‌ స్క్రీన్లోనే ఒక టికెట్‌ ధర సుమారు రూ. 300 వరకు ఉండే అవకాశముంది. అదే మల్టీప్లెక్స్ల్లో అయితే రూ. 400 పైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది…

కర్ణాటకలో సలార్ సినిమా యొక్క టికెట్ల రేట్లు సామాన్యులకు అందనంత దూరం లో ఉన్నాయి అంటూ విమర్శలు వస్తున్నాయి.కన్నడ మీడియా కథనాల అనుసారం గా సలార్ సినిమా ను
( Salaar movie ) ఒక్కరు మల్టీ ప్లెక్స్ లో చూడాలి అంటే కనీసం 750 నుంచి 1000 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది..
ఒక్కరు సింగిల్ స్క్రీన్‌ థియేటర్ లో చూడాలి అంటే 350 నుంచి 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉందట.తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి లో సినిమా కు టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.ఏపీ లో 40 రూపాయలు పెంచేందుకు అనుమతులు ఇచ్చింది.

అయితే నైజాం ఏరియా నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.నేడు సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సలార్ సినిమా( Salaar movie ) వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయాలి అంటే కచ్చితంగా భారీగా టికెట్ల రేట్లు పెరగాల్సిన అవసరం ఉంది.

మధ్య తరగతి ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ అంటే సినిమా ఫస్ట్ ప్రయార్టీ.. అందులోనూ ప్రభాస్ అంటే లేడీస్ ఫ్యాన్స్.. యూత్ ఫ్యాన్స్.. వీళ్లందరూ మధ్య తరగతి కుటుంబాల్లోనే ఉంటారు కదా.. మరీ టూమచ్ రేట్లు అంటున్నారు మధ్యతరగతి ప్రజలు.. టికెట్ 450 రూపాయలు ఏంటని ప్రశ్నిస్తూన్నారు. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని నియంత్రణ చేసి మధ్య తరగతి ప్రజలకు వినోదం అందించే చర్యలు తీసుకోవాలి…
సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం పన్ను మినహాయింపు వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిలిపివేయాలి పేద మధ్య తరగతి ప్రజలకు సినిమా వల్ల అదనపు భారమే తప్ప వినోదం లేదు మన్ను లేదు. అదే విధంగా 450 రూపాయల కనీస టికెట్ ధర వసూలు చేస్తున్న మల్టీఫ్లెక్స్ థియేటర్లలో 150 రూపాయలు కనీస టికెట్ వసూలు చేస్తున్న సింగిల్ ధియేటర్లలోను కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఇటువంటి యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…