ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్..

మీకు అండగా ఈడీలు, సీబీఐలు ఉండొచ్చు..మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు..
వరంగల్ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.వరంగల్ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎవరు రాష్ట్రానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. మొన్న రాహుల్ వచ్చిన, ఈరోజు మోదీ వచ్చినా తిట్టుడే పని. తెలంగాణ అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిట్టడం పరిపాటిగా మారింది. తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారని ప్రధాని మోదీ సభలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టినప్పుడు తెలియదా అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకం పేరును మార్చి కాపీ కొట్టారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.