ప్రధాని సభ పై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!

జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు .. ప్రధాని సభకు పేర్లు లేకుండా పాసులు బ్లాంకుగా ఇచ్చారు.. ప్రధాని హాజరయ్యే సభకు ఈ తరహా పాసులు జారీ చేయడం ఎప్పుడూ చూడలేదు.. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరపాలి.. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంలో పోలీసుల పాత్రపై ఏపీ సీఈఓకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నాలుగేళ్లుగా పవన్ చేసిన కృషి నిన్నటి ప్రజాగళం వేదిక మీద కన్పించింది.. ఈ మూడు పార్టీల కలయిక చాలా మందికి నచ్చదు.. మూడు పార్టీల మధ్య అపోహలు సృష్టించేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు.. దుష్ప్రచారాలకు ఎవ్వరూ లొంగొద్దు.. తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.. పొత్తుల విషయంలో కొందరికి నిరాశ ఎదురైంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు..