‘ప్రజాపాలన’లో శివుడి పేరిట దరఖాస్తు..!!

హనుమకొండ జిల్లా ముత్తారం గ్రామంలో ‘ప్రజాపాలన’లో శివుడి పేరిట దరఖాస్తు రావడంతో అధికారులు నివ్వెరపోయారు. శివుడి పేరుతో గ్యారంటీలకు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి దరఖాస్తు చేశారు. అందులో దరఖాస్తు పేరు శివుడు, భార్య పార్వతీదేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడు అని రాశారు..గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతుబంధు, ఇందిరమ్మ ఇల్లు కోసం ఆర్జీ పెట్టారు. దానికి అధికారులు రసీదు కూడా ఇవ్వడం గమనార్హం. కాగా,‘ప్రజాపాలన’కు 1.25 కోట్ల దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది.

8 రోజుల్లో 1.25 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. రూ.2500 ఆర్థికసాయం, రూ.500కు సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ళకు అత్యధికమంది అప్లై చేసుకున్నారు.కొత్త రేషన్ కార్డులకు భారీగానే వినతులు వచ్చాయి. అప్లికేషన్లను ఈనెల 17 నాటికి కంప్యూటరైజ్డ్ చేస్తారు. గ్రామసభల్లో ఆర్జీలు ఇవ్వలేకపోయినవారు MRO, MPDO ఆఫీసుల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.