పాలన అంటే ఎలా ఉండాలో తెలంగాణ రాష్ట్రనీ చూసి నేర్చుకో మోడి… నటుడు ప్రకాష్ రాజ్.

తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ.. హైదరాబాద్ కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చుకోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను ఇందులో ప్రస్తావించారు. మోడీ పర్యటనకు వస్తున్నారంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు వద్ద నుంచి అధిక పన్నుల రూపంలో వసూలు చేస్తారని ప్రకాశ్ రాజ్ అన్నారు. ..తెలంగాణలో మాత్రం ప్రజల సొమ్మును రాష్ట్రాభివృద్ధి కోసం ఖర్చు చేస్తారని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అందుకే ఈ అభివృద్ధి ఫలాలను ఈ పర్యటనలో ప్రధాని ఆస్వాదించాలని సూచించారు. దూరదృష్టితో ప్రజలకు మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో తెలంగాణ చూసి నేర్చుకోవాలని పరోక్షంగా నరేంద్ర మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు..