ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. సంచలన వ్యాఖ్యలు.బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు…

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన బిహార్ లో జన్ సురాజ్ పాదయాత్ర సాగిస్తోన్నారు.

తాజాగా ఆయన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండబోరని, తాను మళ్లీ ముఖ్యమంత్రినికాలేననే విషయం ఆయనకు తెలుసనీ పేర్కొన్నారు. అందుకే- రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరును ప్రతిపాదించారని వివరించారు. తేజస్వి యాదవ్ పేరును ప్రతిపాదించడం వల్ల రాష్ట్రీయ జనతాదళ్ ఓటుబ్యాంకును ఆకర్షించవచ్చనేది ఆయన వ్యూహమని చెప్పారు.

యాదవుల పాలనలో..
యాదవుల పరి పాలనలో బిహార్ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారని, గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండట్లేదనే విషయం పాదయాత్రలో తేటతెల్లమౌతోందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటోన్నారని, ఆ మార్పును తీసుకుని రావడమే తన లక్ష్యమని అన్నారు. తన కంటే గొప్పవాడు అధికారంలోకి రావడం నితీష్ కుమార్ ఏ మాత్రం ఇష్టం లేని వ్యవహారమని విమర్శించారు…మహాకూటమి గురించి నితీష్ కుమార్ అందరికంటే ముందుగా తననే సంప్రదించారని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు. 2022 మార్చిలో ఢిల్లీలో తన వద్ద ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారని, ఇందులో చేరాలని కోరినట్లు చెప్పారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తే, 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత తనను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించి- సొంత పార్టీ నాయకుడిని కూర్చోబెడుతుందనే విషయం నితీష్ కుమార్ కు తెలుసని, అందుకే మహాకూటమిని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.