రేవంత్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ అభినందనలు..!!!

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఎన్నికలలో తలపడిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈసారి తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదయినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందరూ ఓటర్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎవరి గాలి వీస్తుంది అన్నది అందరిలోనూ ఒకటే ప్రశ్న.

ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నాయి? అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలలో సగానికి ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో విజయాన్ని సాధిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పాయి.
మరికొన్ని సర్వేలు బీఆర్ఎస్ కు పట్టం కడితే మెజారిటీ సర్వేలు మాత్రం ఈసారి హస్తం హవా కొనసాగుతుందని చెప్పాయి. ఇక ఈరోజు ఓటింగ్ సరళిని బట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అన్నది అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజలలోను ఆసక్తికరంగా మారింది.

ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. రేవంత్ రెడ్డికి ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాల్ చేశారని, రేవంత్ రెడ్డికి కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల సిద్ధాంతకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమైనదని గతంలోనే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కాంగ్రెస్ 74 పైచిలుకు సీట్లతో అఖండ విజయం సాధిస్తుందని అభినందించారని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. తెలంగాణ ఎన్నికలలో వ్యూహాత్మక విజయం సాధించిన సునీల్ కనుగోలు మరియు అతని బృందానికి, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి బృందానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ కిషోర్ వారిని అభినందించారని సమాచారం.