రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీతక్క ఓటుపై కలకలం..!!

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారనే వార్త కలకలం రేపింది. విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కాకుండా పొరపాటున ఆమె ముర్ముకు ఓటేశారంటూ జరిగిన ప్రచారం చర్చనీయాంశంగా మారింది…

ఓటు వేసే క్రమంలో జరిగిన తప్పిదంపై సీతక్క క్లారిటీ..!!

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా అయోమయం నెలకొంది. అయితే, ఓటు వేసే విషయంలో తప్పిదం పై క్లారిటీ సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటానని, కాంగ్రెస్ పార్టీ అదేశానుసారం ప్రకారమే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విషయంలో తప్పిదం పై క్లారిటీ సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుచుకుంటానని, కాంగ్రెస్ పార్టీ అదేశానుసారం ప్రకారమే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశానని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. క్రాస్ ఓటింగ్ చేసే అలవాటు తనకు లేదన్నారు. ఓటు వేసే క్రమంలో బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా మరో చోట ఇంకు పడిందని వివరణ ఇచ్చారు..