భారత రాష్ట్రపతి బిజెపి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము…
గిరిజన మహిళకి అవకాశం ఇచ్చిన బీజేపీ.
రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు…
చేసినట్టు బీజేపి ప్రకటించింది. ఇదే ఎన్నికకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించిన కొద్ది గంటల అనంతరమే బీజేపి నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఢిల్లీలోని బీజేపి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో బీజేపి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్యలు ఈ సమావేశానికి హాజరయ్యారు… కొద్ది సేపటి కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముర్ము పేరును అధికారికంగా ప్రకటించారు. ఆదివాసీ మహిళ అయిన ముర్ము 2015-2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్ శాఖల మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ముర్ము టీచర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.