ప్రైవేట్ పాఠశాలలలో విలేకరుల పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు..!!!

*ప్రైవేట్ పాఠశాలలలో విలేకరుల పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు..!!

ఇటీవల శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గుర్తింపు పొందిన విలేకరులకు నూరు శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని ప్రైవేట్ పాఠశాలలను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది..;

ఆ ఉత్తర్వులను *యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ చైర్మన్ గొల్లపూడి మోహన్ రావు హైకోర్టులో సవాల్ చేసారు..!!

ఈ కేసులో న్యాయవాది శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ నూరు శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని ఏ చట్టంలోనూ లేదు అని అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటివ్ విషయంలో జిల్లా కలెక్టర్ కు చట్టపరంగా ఎటువంటి అర్హత లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు…!

*హైకోర్టు సదరు ఉత్తర్వులపై స్పందిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మితిమీరిన చర్యలు అని ఏ అర్హతతో ఈ ఉత్తర్వులు ఇచ్చారు అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు…!

*చట్టంలో 100% ఫీజు రాయితీ పై ఎటువంటి ప్రొవిజన్ లేని కారణంగా సదరు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మద్యంతర ఉత్తర్వులను జారీ చేశారు..!!