కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా…

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్‌ ద్వారా వివరించారు.కరోనా నిబంధనలు పాటిస్తున్నట్టు ప్రియాంక వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన మరుసటి రోజే ప్రియాంకు పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. అయితే, ప్రియాంక గాంధీ కరోనా బారినపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు గత జూన్‌లో మహమ్మారి బారినపడ్డారు..