కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన సాగుతుంది ..తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌..

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన సాగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ అన్నారు..తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ లోని సచివాలయం వద్ద ఉద్యోగుల సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో కోదండరామ్‌ పాల్గొన్నారు. ఉత్సాహంగా హర్షధ్వానాలు చేశారు.

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై కోదండరామ్ మరోసారి విమర్శలు చేశారు. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాని కోదండరామ్‌ హామీ ఇచ్చారు..