పులిచింతల ప్రాజెక్టు సమీప ప్రాంతాలలో భూ ప్రకంపనలు..!!

సూర్యాపేట జిల్లా..

చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు.. మరియు మేళ్లచెరువు మండలంలో భూమి 7.35నిమిషాలకు కంపించింది. రెండుసార్లు భరీ ఎత్తున శబ్దాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు…

అయితే ఎన్ని సెకన్ల పాటు భూమి కంపించిందన్న విషయం తెలియరాలేదు…

ఆంధ్ర రాష్ట్రంలో కూడా పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు జడేపల్లి తండా, కంచిబోడు తండాలో భూమి కనిపించిందని స్థానికులు తెలిపారు…

అయితే ఈ భూ ప్రకపంనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన పనిలేదని అధికారులు కోరారు…

గతంలో కూడా సుమారు ఇటువంటి శబ్దాలతో చింతలపాలెం మండల వాసులకి నిద్ర పట్టకుండా చేసింది..

రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రస్తుతం ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు…