పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద… 17 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల.. అప్రమత్తమైన కృష్ణానది పర్యవాహక ప్రాంత అధికారులు!!

సూర్యాపేట జిల్లా..

చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్ కు ఎగువ నుండి భారీ వరదరావడంతో పులిచింతల ప్రాజెక్టులోని క్రస్ట్ గేటు లో ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది……. ఎగువ నుండి మూసి, సాగర్ వాటర్ బాగా రావడంతో పులిచింతల ప్రాజెక్టుకి పూర్తిస్థాయిలో నీరు వచ్చి చేరింది…… సాగర్ నుండి సుమారు నాలుగు లక్షల పైచిలుకు టీఎంసీల వాటర్ వస్తుందని సమాచారంతో అప్రమత్తమైన పులిచింతల ప్రాజెక్టు అధికారులు ముందస్తుగా 17 క్రస్ట్ గేటులను ఓపెన్ చేసి దిగువ కృష్ణాజిల్లా కి నీటి విడుదల చేస్తున్నారు……

పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది పరివాహక ప్రాంతాలైన మఠంపల్లి, పాలకీడు, చింతలపాలెం మండలంలో పలు గ్రామాలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు…..

పులిచింతల ప్రాజెక్టు నీరు భారీగా రావడంతో మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులను ముందస్తు జాగ్రత్తగా కృష్ణా నది స్నానానికి అనుమతి ఇవ్వడం లేదు…

*పులిచింతల ప్రాజెక్టు సమచారం..*

*- పులిచింతల కు భారీగా వరద*

*ప్రాజెక్టుసమాచారం*.

*-ఇన్ ఫ్లో: క్యూసెక్కులు 3.43.381*
*-అవుట్ ఫ్లో:4.41,158. క్యూసెక్కులు.*
*-నీటిమట్టం: 166.204/175 అడుగులు.*
*-సామర్థ్యం:33.184/ 45.77 టీఎంసీలు.*
*మూడు యూనిట్ల ద్వారా కొనసాగుతున్న విద్యుత్తుత్పత్తి*
*17 గేట్లు 3.5 మీటర్ల మేర ఎత్తి కిందకు నీటి విడుదల*