పూణేలో తెలంగాణ వాసులను శుక్రవారం రాత్రి అరెస్ట్.!.

మహారాష్ట్ర..
మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.పూణేలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది. ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్‌‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు…హైదరాబాద్ టూ పుణే జాతీయ రహదారిపై మాటు వేసి మరీ డ్రగ్స్‌ను ముఠాను డీఆర్‌ఐ బృందం పట్టుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు…తెలంగాణలో ఎక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారని దానిపై విచారణ చేపట్టారు. పట్టుబడ్డ నిందితులు డ్రగ్స్‌ను వివిధ రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడులు చేసే అవకాశం ఉంది. అయితే డ్రగ్స్‌పై నిందితులు నోరు విప్పకపోవడంతో తమదైన స్టైల్‌లో అధికారుల బృందం కూపీ లాగుతోంది…