పునీత్‌ – రాజ్‌కుమార్‌ ‘హార్ట్‌ టచింగ్‌’ పెయింటింగ్‌.. వైరల్‌…

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణాన్ని అక్కడి ప్రజలు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరులోని పునీత్‌ సమాధి వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయన పట్ల ఉన్న అభిమానం, చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ తన తండ్రితో వైకుంఠంలో ఉన్నట్టుగా ఓ చిత్రకారుడు గీసిన పెయింటింగ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రముఖ చిత్రకారుడు కరణ్ ఆచార్య రూపొందించిన ఈ పెయింటింగ్‌లో పునీత్‌.. తన తండ్రి రాజ్ కుమార్‌కు వెనుక నుంచి వచ్చి ఆయన కళ్లు మూసినట్టుగా గీశారు. ఈ పెయింటింగ్‌ను చూస్తున్న ఆయన అభిమానులు భావోద్వేగంతో ‘హార్ట్‌ టచింగ్‌.. వి మిస్‌ యూ పునీత్‌ సర్‌, మాటలు రావడం లేదు.. కన్నీళ్లు వస్తున్నాయి. వాట్‌ ఏ క్రియేటివిటీ, అద్భుతం’’ అంటూ ట్విటర్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.