పునీత్ చివరి చిత్రం “జేమ్స్ మూవీ రికార్డులు బద్దలు కొట్టింది..!!!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున హీరోలు తరలి వెళ్లి పునీత్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఒక స్టార్ అయినప్పటికీ ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ కు అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టింది. అయితే పునీత్ చివరి చిత్రం “జేమ్స్” మార్చి 17న ఆయన జయంతి సందర్భంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలయింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో రికార్డులు బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు…ఆయన మరణంతో తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చాలా బాధ పడిన పరిస్థితి కనిపించింది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ జేమ్స్ సినిమాను ఓ పండగలా సెలెబ్రేట్ చేసుకోవాలని కన్నడ ఇండస్ట్రీ సిద్దం అయినట్లు తెలుస్తోంది.వారం పాటు మరో సినిమా ఉండకూడదు అని స్టేట్ మొత్తం ఈ సినిమానే అన్ని థియేటర్స్ లో ప్రదర్శితం చేస్తున్నారు… ఇక అశేష అభిమానులు సినీ ప్రేక్షకులు థియేటర్స్ లో చివరి సారి పునీత్ రాజ్ కుమార్ ని చూడటానికి భారీ సంఖ్యలో థియేటర్ కి తరలి వస్తున్నారు..కన్నడ సినిమాల రికార్డులు తిరగరాసి ఇప్పుడు ఈ సినిమా సంచలన ఓపెనింగ్స్ తో పునీత్ రాజ్ కుమార్ పేరిట కొత్త రికార్డ్ ఏర్పడిందని అంటున్నారు. గతంలో కన్నడ సినిమాల పరంగా KGF చాప్టర్ 1 సినిమా 16.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా అన్ని సినిమాల పరంగా చూసుకుంటే బాహుబలి 2 సినిమా 19.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టాప్ లో నిలబడింది…ఈ రికార్డును కూడా జేమ్స్ సినిమా బద్దలు కొట్టిందని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ అంచనాల మేరకు మొదటి రోజు ఈ సినిమా 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఫైనల్ లెక్కలు క్లియర్ గా ఇంకా విడుదల కాలేదు కానీ ఈ అంచనాలు ఏమాత్రం నిజమైనా కన్నడ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ బద్దలు అయినట్టే చెప్పాలి. ఇక జేమ్స్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 35 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకుందని సమాచారం…

పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు: భావోద్వేగంతో..

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయిదు భాషల్లో సినిమా విడుదల అయింది. సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి కూడా ఇవ్వాళే కావడంతో కర్ణాటకలో పండగ వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద జేమ్స్ జాతర కనిపించింది. తమ ఆరాధ్య హీరో చివరి మూవీని అభిమానులు భావోద్వేగంతో వీక్షించారు. ఆయన లేడనే విషయాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు.

అయిదు భాషల్లో..
ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్. చేతన్ కుమార్ దర్శకుడు. కిశోర్ పత్తికొండ ఈ సినిమాను నిర్మించారు. ప్రియా ఆనంద్, తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు శరత్ కుమార్, తిలక్ శేఖర్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ ఇతర పాత్రలను పోషించారు. పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసే సమయానికి జేమ్స్ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగిలిన ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.

కర్ణాటక.. అప్పుమయం..
ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై ఈ మూవీని విడుదల చేసింది యూనిట్. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న తమ ఆరాధ్య హీరో నటించిన చివరి చిత్రం విడుదల కావడంతో పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల ఆనందానికి హద్దు లేదు. కర్ణాటక మొత్తం పునీత్ మయం అయిపోయింది.

థియేటర్ల వద్ద పండగ…

పునీత్ రాజ్‌కుమార్ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలకు లెక్కే లేదు. పునీత్ కటౌట్లకు పూజలు చేశారు. టెంకాయలు కొట్టారు. బెంగళూరులోని దాదాపు అన్ని థియేటర్లల్లో ఈ సినిమాను మార్నింగ్ షోగా ప్రదర్శించారు. థియేటర్లు, ప్రధాన కూడళ్లల్లో పునీత్ రాజ్‌కుమార్ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టారు. అన్నదానం చేశారు. ఒక్క బెంగళూరులోనే కాకుండా రామనగర, మైసూర్, హసన్, మంగళూరు, బెళగావి, విజయపుర, కలబురగి, దావణగెరె.. ఇలా అన్ని నగరాలు, పట్టణాల్లో జేమ్స్ జాతర నెలకొంది…

సినిమా చూసిన పునీత్ కుటుంబం..
సినిమా చూసిన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ అభిమాన హీరో నుంచి మరో సినిమా ఇక రాబోదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు వీరభద్రేశ్వర థియేటర్‌లో తొలి షోను వేశారు. పునీత్ రాజ్‌కుమార్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, యువరాజ్ కుమార్, వినయ్ రాజ్‌కుమార్‌తో పాటు చిత్ర దర్శకుడు చేతన్ కుమార్, నిర్మాత కిశోర్ పత్తికొండ, హీరోయిన్ ప్రియా ఆనంద్ వీక్షించారు.

పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని కంఠీరవ స్టూడియోలో గల ఆయన సమాధాని అలంకరించారు. అన్న సంతర్పణను ఏర్పాటు చేశారు. ఇవ్వాళ ఒక్క రోజే లక్ష మందికి పైగా భోజనాన్ని వడ్డించేలా సన్నాహాలు చేశారు. జయంతి నాడు పునీత్ రాజ్‌కుమార్‌ను దర్శించడానికి అభిమానులు పోటెత్తారు. కంఠీరవ స్టూడియోకు బారులు తీరారు. తెల్లవారు జాము నుంచే కంఠీరవ స్టూడియో అభిమానులతో నిండిపోయింది. ఆయనకు నివాళి అర్పిస్తూ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.