అభిమానానికి ఎల్లలు ఉండవు అంటూ అంటూ ఉంటారు… ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో నటులకు మాత్రం ఎక్కువాగా ఉంటారు…
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కు తెలుగు రాష్ట్రాల లో ఎంతమంది అభిమానులు చనిపోయ్యారు… మళ్లీ ప్రస్తుతం కన్నడనాట పునీత్ పేరు కాదు..
ఒక ఎమోషన్.. ఒక బ్రాండ్.. యూత్ ఐకాన్.. ఇలా ఎన్ని పేర్లు అయినా పెట్టుకోవచ్చు. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న నటుడు ఉన్నట్టుండి గుండెపోటుతో మరణిస్తే అభిమానులు ఎలా తట్టుకుంటారు..? వాళ్ల గుండెలు మాత్రం ఎలా ఆగిపోకుండా ఉంటాయి..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. పునీత్ మరణించిన విషయం తెలుసుకుని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు.. మరికొందరు బలవన్మరణం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో నలుగురు అభిమానులు ఇలా ప్రాణాలు కోల్పోయారు.. ఎవరు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకండి అని ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో వాళ్లు లేరు. తమ రాజకుమార ఇక ఎప్పటికీ రాడని.. తమకు లేడు అనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేక తమ ప్రాణాలు వదిలేస్తున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణవార్త విన్న వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే రాయచూరు జిల్లాలో ఇద్దరు అభిమానులు బసవ గౌడ్, మహమ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అందులో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చామరాజనగర్ జిల్లాలో మునియప్ప అనే అభిమాని టీవీ చూస్తూనే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఉడిపి జిల్లాలో సతీష్ అనే రిక్షా కార్మికుడు తన అభిమాన హీరో పునీత్ చిత్రపటానికి పూలమాల వేస్తూ అలాగే కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. మరో అభిమాని సైతం ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...