ఢిల్లీతో పాటుగా పలు హిమాలయా రాష్ట్రాలు భూప్రకంపనలతో వణికిపోతున్నాయి….

గత కొంత కాలంగా ఉత్తరాదిన భూకంపాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ నెల 9న నేపాల్ లో సంబవించిన భూకంప ప్రభావం ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో పడింది. ఢీల్లీ, ఉత్తారాఖాండ్ పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంబవించాయి. 12న ఢిల్లీలో 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.4 గా నమోదు అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పంజాబ్ లో భూకంపం సంబవించింది.

పంజాబ్ లో ని అమృత్ సర్ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1 గా నమోదు అయినట్టుగా నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ వారు తెలియజేశారు. భూమి లోపల సుమారు గా 120 కీ.మీ లోతులో ఈ భూకపం కేంద్రం కేంద్రీకృతమైనట్లుగా సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ వారు తెలియజేశారు. కాగా, రోజుల వ్యవధిలోనే భూకంపాలు ఉత్తరాది ప్రజకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఢిల్లీతో పాటుగా పలు హిమాలయా రాష్ట్రాలు భూప్రకంపనలతో వణికిపోతున్నాయి.

పంజాబ్ లో భూమి కంపించడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.. వేకువ జామునుంచి రోడ్లపైనే ఉండిపోయారు. ఈ నెలలో దేశ వ్యాప్తంగా భూమి ప్రకంపించడం ఇది మూడోసారి.. అయితే భూకంప ప్రభావం తక్కువ మోతాదులో ఉంటుంది కనుక ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అంటున్నారు.