పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా నేరేడుచర్ల మండలం వాసి..

పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా నేరేడుచర్ల మండలం వాసి..

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ ఆప్ పార్టీ విజయం సాధించడం… అందరికీ తెలిసిన విషయమే… కానీ ఇందులో మరో విషయం ఏమిటంటే సీఎం ముఖ్య కార్యదర్శి గా తెలుగు వారంటూ ప్రచారం విస్తృతంగా నడిచింది…ఉమ్మడి నల్గొండ జిల్లా,, ప్రస్తుతం (సూర్యాపేట జిల్లా) నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామనికి చెందిన అరిబండి రంగయ్య మంగమ్మ దంపతుల రెండో కుమారుడైన వేణు ప్రసాద్….
వీరి జననం 1964.. ఈ గ్రామంలో కొంతకాలం వున్న ఆ గ్రామంతో ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి… ప్రాథమిక విద్య మునగాలలో ఉన్నత పాఠశాల పదో తరగతి వరకు ఖమ్మంలో చదివారు నాగార్జునసాగర్.. గురుకులంలో ఇంటర్ విద్యను పూర్తి చేశారు 1991లో సివిల్స్ లో ఐఏఎస్ సాధించారు.. ఉద్యోగరీత్యా పంజాబ్ లొ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఎండి గా పనిచేస్తున్న అరిబండి వేణు ప్రసాద్ పంజాబ్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు…. ఆయన ఉన్నత విద్య పదవి చేపట్టడంతో గ్రామస్తుల్లో మండల వాసులలో హర్షం వ్యక్తం అవుతోంది…. ఓ మారుమూల గ్రామం నుండి దేశ స్థాయిలో గర్వించేలా, ఒక రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా ఎదగడం ఎంతో గర్వించదగిన విషయం అంటూ యూత్ అంతా కూడా అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు…. …