పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ఈసారి అస్సలు తగ్గేదేలే అంటున్నారు బన్నీ, సుకుమార్. పెరిగిన అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప2 వీడియో అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది…
పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యావత్ దేశం ఈ సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. దీంతో సుకుమార్ ఈ సినిమాపై మరింత దృష్టి సారించాడు. ఇందులో భాగంగానే సినిమాను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల పుష్ప సీక్వెల్‌కు సంబంధించి విడుదలైన టీజర్ సైతం ప్రేక్షకులను…యావత్ ఇండియన్ సినిమా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సినిమా ‘పుష్ప2 ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఒక్కసారి షేక్ చేసింది. రికార్డులతో పాటు కలెక్షన్ల సునామీని కురిపించింది. ఎర్ర చందనం బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రం చందనం సిండికేట్‌కు ఎలా అధిపతిగా మారాడే దర్శకుడు చూపించాడు.
పుష్ప2: ది రూల్ విడుదల తేదీన చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2024 ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పుష్ప సీక్వెల్ విడుదల తేదీని దాదాపు ఏడాది ముందు ప్రకటించడం విశేషం. ఇంత టైమ్ తీసుకుంటేనే అర్థమవుతోంది సుకుమార్ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో. ఇక పుష్ప సీక్వెల్ రిలీజ్ డేట్‌పై అధికార ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే, మరికొందరు మాత్రం ఇంకా 11 నెలలు ఎదురు చూడాలా అని ఢీలా పడుతున్నారు.