విదేశాల్లో పుష్ప ఫీవర్….పుష్ప అంటే పడి చస్తున్నారు…!!

పుష్పలోని ఐటమ్‌ సాంగ్‌పై పడింది. అంతే ఇద్దరు కలిసి ఆ సాంగ్‌కి స్టెప్పులేసి సమంతని మరిపించారు. మ్యాచింగ్‌ లైఫ్‌ స్టైల్ వార్తల్లో

పాపులర్‌గా పేరు తెచ్చుకున్న చింకీ,మింకీనే సురభి, సమృద్ధి. సమంత ఐటమ్‌ సాంగ్‌ను అదే రేంజ్‌లో స్టెప్పులేసిన వీడియోని తమ ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేసుకొని మరోసారి ఫేమస్ అయ్యారు. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు చేసిన ఐటమ్‌ సాంగ్‌ వీడియోకి సోషల్ మీడియాలో సమంత, రూత్‌ప్రభు చేసిన వీడియో వ్యూస్‌ని క్రాస్‌ చేస్తోంది. పొట్టి డ్రెస్సులు వేసుకొని నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఇరగదీశారంటూ ట్విన్స్‌ ఫాలోవర్స్‌ కామెంట్స్ పోస్ట్ చేశారు.

పుష్ప అంటే పడి చస్తున్నారు..,

పుష్ప సినిమా కంటే అందులోని పాటలే బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే సినిమాలోని సాంగ్స్‌ని సెలబ్రిటీలు సైతం స్టెప్పులు వేసి పుష్ప సాంగ్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదే ట్రాక్‌లోకి వచ్చింది నటి లారెన్‌ గాట్లిబ్laurengottlieb. ఈ భోజ్‌పూరి పవర్‌స్టార్‌ పవన్‌ సింగ్‌power star bhojpuri pawan singhతో కలిసి మ్యూజిక్ వీడియో చేసిన ముద్దుగుమ్మ రష్మిక మందనrashmika mandanna , అల్లుఅర్జున్‌ Allu Arjun స్టెప్పులేసిన సామి సామి పాటకు కాలిఫోర్నియాcaliforniaలోని రోడ్లపై బ్లాక్‌ టాప్‌ వేసుకొని స్టెప్పులు వేసింది. ఆ వీడియోని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వరల్డ్‌ వైడ్‌గా వైరల్ అవుతోంది పుష్ప సినిమాలోని సామి సామి అనే సాంగ్. ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియోకి ఇప్పటికే రెండు లక్షల లైకులు వచ్చాయి. నిజంగా రష్మిక మందన చేసిన డ్యాన్స్‌కి ఎన్ని లైకులు వచ్చాయో తెలియదు కానీ..లారెన్‌ వేసిన స్టెప్పులతో పుష్ప ఫీవర్‌ ఫారెన్‌ వరకూ పాకిపోయిందంటున్నారు నెటిజన్లు.

పుష్ప ఫీవర్‌ ఓ రేంజ్‌కెళ్తోంది..

పుష్ప సినిమా ఓ ట్రెండ్ సెట్ చేస్తే..అందులోని పాటలు సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యాన్ ఇండియా సినిమాగా సుకుమార్ రూపొందించిన పుష్పకు ఇండియాతో పాటు ఫారిన్‌లో కూడా ఫ్యాన్స్‌ తయారైపోయారు. సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్‌లు పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ..డైలాగ్‌లను ఇమిటేట్‌ చేస్తున్నారు. ఇంతకు మించి ఏం కావాలి తెలుసు సినిమా గొప్పతనాన్ని చాటడానికి అంటున్నారు మూవీ క్రిటిక్స్.

పుష్ప సినిమాలో సాంగ్స్‌కు వస్తున్న క్రేజ్‌ చూస్తున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్..పుష్ప పార్ట్-2 మూవీకి ఏ రేంజ్‌కి వెళ్తుందో అని ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ భామ రష్మిక మందాన్న నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దాంతో దేశ వ్యాప్తంగా ఏడ చూసినా.. ప్రస్తుతం పుష్ప మేనియానే నడుస్తోంది. ఎవరిని కదిలించినా పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ పాటలు పాడడం, టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ‘శ్రీవల్లి’ పాటలోని హుక్ స్టెప్‌కి జనాలు ఫిదా అయిపోయారు..శ్రీవల్లి’ పాటలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్‌ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయింది. ‘శ్రీవల్లి’ ఫీవర్ తాజాగా కొరియాకు కూడా పాకింది. ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న శ్రీవల్లి పాటకు ఓ కొరియన్ మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అల్లు అర్జున్ లాగానే దుస్తులు ధరించి హిందీ పాటకు హుక్ స్టెప్‌ వేసింది. వెనకాల టీవీలో వీడియో సాంగ్ ప్లే అవుతుంటే.. కొరియన్ మహిళ హుక్ స్టెప్‌ను అచ్చు దింపేసింది. నిజం చెప్పాలంటే ఐకాన్ స్టార్‌కు ఏమాత్రం తీసిపోలేదు. ఎందరో రిక్రియేషన్ చేసినా.. ఇది బెస్ట్ అని చెప్పక తప్పదు.