“పుష్ప” మూవీ రివ్యూ.

ఈ సినిమాకు అల్లు అర్జున్‌ నటనే హైలెట్‌ అని చెబుతున్నారు. వన్‌మ్యాన్‌ షో చేశాడని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. అలాగే యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయి అంటున్నా…అల్లు అర్జున్‌ని ఊర మాస్‌గా చూసి ఉంటారు.. కానీ నేల మాస్‌గా చేస్తే ఫ్యాన్స్‌కి పూనకాలే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ భారీ అంచనాల నడుమ డిసెంబర్‌ 17న ఏడు భాషల్లో రిలీజ్‌కి రెడీ అయ్యింది.

దర్శకత్వం : సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్.

చిత్రం: పుష్ప- ది రైజ్ నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, ఫహాధ్ ఫాసిల్, అనసూయ, రావు రమేష్, అజయ్ ఘోష్ తదితరులు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శేఖర్ దర్శకత్వం: సుకుమార్ బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్.

“ఆర్య”, “ఆర్య 2” సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా “పుష్ప”. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా లోని మొదటి భాగం “పుష్ప: ది రైజ్” ఇవాళ అనగా డిసెంబర్ 17, 2021 న విడుదలైంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు సునీల్. మలయాళం స్టార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న ఈసినిమా శేషాచలం అడవుల్లో నేపద్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ తో సాగనుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..పుష్పరాజ్ (అల్లుఅర్జున్) ఒక డైలీ లేబరర్. కొండా రెడ్డి, జాలి రెడ్డి మరియు జక్క రెడ్డి ల కింద ఉండే ఒక గ్రూప్ లో పని చేస్తూ ఉండేవాడు. అందరూ కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళు. కానీ నెమ్మదిగా ఒక మామూలు కూలి నుంచి ఓనర్ గా మారిపోతాడు పుష్ప రాజ్. అప్పుడే మంగళం శ్రీను (సునీల్) వల్ల ఇబ్బందుల్లో పడతాడు పుష్పరాజ్. కానీ అవన్నీ దాటుకొని స్మగ్లింగ్లో డాన్ గా ఎలా ఎదిగాడు? అనేది పుష్ప కథ. శ్రీవల్లి (రష్మిక మందన్న) తో అతని ప్రేమ కథ ఏంటి? భాన్వర్ సింగ్ శేకావాట్ (ఫహాధ్ ఫాసిల్) తో పుష్ప రాజ్ కి వైరం ఎలా ఏర్పడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘తగ్గేదే లే’ అంటూ భారీ అంచనాలతో వచ్చిన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్, ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో మరియు గ్రాండ్ విజువల్స్ లో ఏ మాత్రం తగ్గలేదు. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, బన్నీ పాత్రలోని షేడ్స్ ను, రష్మిక మండన్నాతో సాగే లవ్ ట్రాక్ ను, అలాగే అడవి నేపథ్యాన్ని.. ఆ నేపథ్యంలోని ఎర్రచందనం మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా సుకుమార్ ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బన్నీ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి.

ఇక ‘పుష్ప’రాజ్‌’ పాత్రకు అల్లు అర్జున్‌ ప్రాణం పోశారు. మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో బన్నీ అద్భుతంగా నటించాడు. నిజంగానే కుడి భుజం వంగి పోయినట్టు చాలా సహజంగా కనిపించాడు. బన్నీ – రష్మిక ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అన్నట్టు శ్రీవల్లీగా రష్మిక మందన్న డీ గ్లామర్ లుక్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. నటన పరంగానూ రష్మిక ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది.

హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. కీలక పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌ గా బాగుంది. మంగళం శ్రీనుగా సునీల్ కొత్తగా కనిపించాడు. సునీల్ కెరీర్ లో నిలిచిపోయే పాత్ర ఇది. దాక్షాయణిగా అనసూయ నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు…

మైనస్ పాయింట్స్ :

పుష్పరాజ్ పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో, కథను మొదలు పెట్టడంలో మాత్రం సుకుమార్ చాలా స్లోగా ప్లేను నడిపాడు. పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల అవి మెలోడ్రామాలా అనిపిస్తాయి. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, పైగా మధ్యమధ్యలో ఆ పాత్రలను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ వస్తూ ఉండటం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అమవసరమైన డిస్కషన్ కూడా సినిమా స్థాయుకి తగ్గట్టు లేదు.

ఇక సినిమాలో సెకండాఫ్ అయితే మరీ స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నట్లు స్మగ్లింగ్ సీన్స్ నే ఎక్కువ పెట్టారు. పోలీసుల నుంచి హీరో ఎదుర్కొనే అవరోధాలు, అటాక్ లు కూడా పూర్తి సినిమాటిక్ గానే సాగాయి. అలాగే సెకెండ్ పార్ట్ పై ఆసక్తి తారాస్థాయికి తీసుకువెళ్ళగలిగే ముగింపును కూడా ఇవ్వలేకపోయారు. పుష్పరాజ్ – భన్వర్ సింగ్ మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది…