పుష్ప చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌తో అలరించనున్న సమంత..

R9TELUGUNEWS.COM… అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘పుష్ప ది రైజ్‌’ డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సమంత ఐటమ్‌ సాంగ్‌తో అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించారు. మాస్‌ను మరోసారి ఆకట్టుకునేలా దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సాంగ్‌ను తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈనెల 12న ‘పుష్ప ప్రీరిలీజ్‌ పార్టీ’ని హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.