పుతిన్​తో మాట్లాడిన మోదీ..అధికారిక ప్రకటన..

యుద్ధం వేళ పుతిన్‌కు ప్రధాని ఫోన్‌ కాల్‌...

నాటోలో ఉక్రెయిన్ చేరడం ప‌ల్ల కొన్ని నెల‌లుగా ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య ఆందోళ‌నక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ‌త కొంత కాలంగా రెండు దేశాల మ‌ధ్య యుద్దం జ‌రుగుతాయ‌నే ఉద్రిక్తత నెల‌కొంది. అయితే నేటి ఉద‌యం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ర‌ష్యా ఉక్రెయిన్ పై యుద్దం చేయ‌డం ప్రారంభించింది. ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల కీలుబొమ్మ అని, అది స‌రైన దేశం కాద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ గ‌తంలోనే పేర్కొన్నారు. ..

గురువవారం ఉద‌యం ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా భారతదేశ జోక్యాన్ని కోరారు. ప్ర‌పంచంలో భార‌త‌దేశం చాలా ప్ర‌భావంత‌మైన‌ది. మేము ఈ సంక్షోభ స‌మ‌యంలో భార‌త్ మ‌ద్ద‌తు కోరుతున్నాం’’ అని ఆయ‌న అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత శక్తిమంతమైన, గౌరవనీయమైన ప్రపంచ నాయకులలో ఒకర‌ని తెలిపారు. మోదీ బ‌ల‌మైన స్వ‌రంతో పిలిస్తే, పుతిన్ ఆలోచిస్తార‌ని త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ….
ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు.ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు టెలిఫోన్‌లో మాట్లాడారు…భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో గురువారం రాత్రి మాట్లాడారు. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలని ఆయనకు మోదీ సూచించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మోదీ పుతిన్‌కు తెలిపారు. అదేవిధంగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని ప్రధాని గుర్తు చేశారు…

అందరు అసెక్తిగా చూశారు మోడీ నిర్ణయం ఏమిటి..

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనున్నారన్న విషయం ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ మారింది…

దౌత్యపరమైన చర్చలతోనే సమస్యకు పరిష్కారం వెతకాలని మోదీ సూచించినట్లు పేర్కొంది. ఇక ఉక్రెయిన్​కు సంబంధించి ఇటీవలి పరిణామాల గురించి పుతిన్​.. మోదీకి వివరించినట్లు తెలిపింది. పీఎంఓ కార్యాలయం.నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు మోదీ. ఉక్రెయిన్​లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్లు పీఎంఓ తెలిపింది. వారిని సురక్షితంగా భారత్​కు తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పుతిన్​కు వివరించినట్లు పీఎంఓ వెల్లడించింది.తమ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల అధికారులు, దౌత్య బృందాలు తరుచుగా సంప్రదింపులు జరిపేందుకు పీఎం మోదీ, ప్రెసిడెంట్​ పుతిన్​ అంగీకరించినట్లు పేర్కొంది…