భారత్‌, ఆఫ్రికాలను దోచుకున్న మీరా.. నీతులు చెప్పేది!..పుతిన్‌ ధ్వజం…

* అమెరికా, పశ్చిమ దేశాలపై పుతిన్‌ ధ్వజం..

నియమాలకు లోబడి ప్రపంచక్రమం ఉండాలని నీతులు చెబుతోన్న పశ్చిమ దేశాలు, అమెరికా వాటినెప్పుడూ పాటించలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. వలస విధానాలతో అవి భారత్‌, ఆఫ్రికాలను దోచుకున్నాయని, రసాయన, అణ్వాయుధాలతో దేశాలను నాశనం చేశాయని ఆరోపించారు. ఉక్రెయిన్‌ భూభాగాలైన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపొరీజియాను రష్యాలో విలీనం చేస్తూ శుక్రవారం సంతకాలు చేసిన తర్వాత పుతిన్‌.. ప్రసంగించారు. దీని ఆంగ్ల అనువాదాన్ని శనివారం మాస్కో విడుదల చేసింది. మధ్యయుగాల్లోనే పశ్చిమదేశాలు వలస విధానాలను అమల్లోకి తెచ్చాయి. అనంతరం బానిస వ్యాపారమూ జరిగింది. అమెరికాలో రెడ్‌ ఇండియన్లు ఊచకోతకు గురయ్యారు. భారత్‌ను, ఆఫ్రికాను పశ్చిమ దేశాలు దోచుకున్నాయి. ఇది మానవ స్వభావానికి, స్వేచ్ఛకు, న్యాయానికి వ్యతిరేకం” అని పుతిన్‌ పేర్కొన్నారు.