తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట..

దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆశ్చర్యం ఎందుకంటే వీళ్లు బిడ్డను దత్తత తీసుకోవడమో, సరోగసి పద్దతిలోనే బిడ్డను కనడం లేదు. పురుషుడిగా మారిన ఓ మహిళ గర్భవతిగా మారి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం అతడిగా మారిన ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉంది. మరో నెలరోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మను ఇవ్వబోతుంది….

మరో నెల రోజుల్లో అంటే మార్చి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు ట్రాన్స్ జెండర్ యువకుడు. కేరళకు చెందిన జహాద్‌, జియా పావల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ జంట అమ్మానాన్నలు కాబోతున్నారు. దీంతో మా కలలు నెరవేరబోతున్నాయి అంటూ వారు ఇన్ స్టా వేదికగా తమ సంతోషాన్ని షేర్ చేశారు.