కమీడియన్ రాజు శ్రీవాత్సవ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 58 ఏళ్లు. ఆగస్టు 10వ రోజు ఆయన హాస్పిటల్‌లో చేరారు. జిమ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇన్నాళ్లు వెంటిలేటర్‌పై ఉన్న శ్రీవాత్సవ ఇవాళ ఉదయం 10.20 నిమిషాలకు మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కమీడియన్ శ్రీవాత్సవ మృతి పట్ల నివాళి అర్పించారు. శ్రీవాత్సవ సంపూర్ణ ఆర్టిస్ట్ అని, చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి అని, సామాజిక కార్యక్రమాల్లోనూ అతను యాక్టివ్‌గా పాల్గొనేవాడని, ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలుపుతున్నట్లు రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు…ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజు శ్రీవాత్సవ 1980 నుంచి ఉన్నారు. అయితే2005లో జరిగిన గ్రేట్ ఇండియన్ లాఫర్ ఛాలెంజ్ కామిడీ షోతో అతను పాపులర్ అయ్యారు. మైనే ప్యార్ కియా, బాజీఘర్, బాంబే టు గోవా, ఆమ్‌దాని అఠానీ, ఖర్చా రుపయ్యా లాంటి సినిమాల్లో అతను నటించారు. బిగ్ బాస్ మూడవ సీజన్‌లో అతను కాంటెస్టెంట్‌గా పోటీపడ్డారు. యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు చైర్మెన్‌గా చేశారుకమీడియన్ రాజు శ్రీవాత్సవ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 58 ఏళ్లు. ఆగస్టు 10వ రోజు ఆయన హాస్పిటల్‌లో చేరారు. జిమ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇన్నాళ్లు వెంటిలేటర్‌పై ఉన్న శ్రీవాత్సవ ఇవాళ ఉదయం 10.20 నిమిషాలకు మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కమీడియన్ శ్రీవాత్సవ మృతి పట్ల నివాళి అర్పించారు. శ్రీవాత్సవ సంపూర్ణ ఆర్టిస్ట్ అని, చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి అని, సామాజిక కార్యక్రమాల్లోనూ అతను యాక్టివ్‌గా పాల్గొనేవాడని, ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలుపుతున్నట్లు రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజు శ్రీవాత్సవ 1980 నుంచి ఉన్నారు. అయితే2005లో జరిగిన గ్రేట్ ఇండియన్ లాఫర్ ఛాలెంజ్ కామిడీ షోతో అతను పాపులర్ అయ్యారు. మైనే ప్యార్ కియా, బాజీఘర్, బాంబే టు గోవా, ఆమ్‌దాని అఠానీ, ఖర్చా రుపయ్యా లాంటి సినిమాల్లో అతను నటించారు. బిగ్ బాస్ మూడవ సీజన్‌లో అతను కాంటెస్టెంట్‌గా పోటీపడ్డారు. యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు చైర్మెన్‌గా చేశారు..