రథం ముగ్గు తప్పనిసరి వేయాలి….!!!

రథం ముగ్గు తప్పనిసరి వేయాలి.
ఆ రథం యమధర్మరాజుది.
అతన్ని సంక్రాంతి రోజు భూలోకం నుండి సాగనంపుతారు.
చలి వణుకుడుతో సంభవించే మరణాలకు స్వస్తి చెప్పినట్లు.
రథం పైన యమధర్మరాజు బొమ్మను వేసేవారు. ఆ రథానికి ఒక తాడు పెట్టేవారు,

యమధర్మరాజు చేతిలో దండం పెట్టేవారు.
చేతిలో ముగ్గును పోసుకొని, వేళ్ల మధ్య సందుల ద్వారా ముగ్గును జార విడుస్తూ రథం వేసేవారు. మేము ఆ ముగ్గుకు “గజ్జెలు “ కొట్టేవాళ్లం.
పొడుగుముగ్గు అంచులకు అడ్డంగా చిన్న గీతలు – గజ్జెలు.
చేతిలో నుండి ముగ్గు జారాలంటే అది పొడిగా తేమ లేకుండా ఉండాలి. అందుకోసం ఒక టెంకెలో ముగ్గు తీసుకొని, నిప్పుకణికలు వేసేవాళ్లం.
ముగ్గు పొడిలోని తేమ పోయేది.
వాకిలి కూడా కలాపితో తేమగా ఉండకూడదు.
మా అమ్మ గారు ఈ ముగ్గును
వేయడానికి నాలుగు గంటలకు
లేచేవారు.
వేళ్లను ఆడిస్తూ ముగ్గు వేయడాన్ని
గోటి ముగ్గు అంటారు.