రాధే శ్యామ్’ సినిమా రివ్యూ…

రాధే శ్యామ్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ , ప్రస్తుతం ప్రపంచమంతా రాధే శ్యామ్ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ.. కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు మార్చి 11న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ షోలను యూఎస్ లో ఏర్పాటు చేశారు….

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
స్వరాలు: జస్టిన్ ప్రభాకరన్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
కథ, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
విడుదల తేదీ: మార్చి 11, 2022..
కథ: విక్రమాదిత్య (ప్రభాస్) వరల్డ్ ఫేమస్ పామిస్ట్. అతను ఓసారి చెయ్యి చూసి జాతకం చెప్పాడంటే తిరుగు ఉండదు. ఎమర్జెన్సీ విధిస్తారని ఇందిరా గాంధీతో చెప్పిన ఘనుడు. అతను చెప్పినవన్నీ జరుగుతాయి. తన చేతి రేఖల్లో ప్రేమ, పెళ్లి లేవనేది విక్రమాదిత్య చెప్పే మాట. అటువంటి అతడు ప్రేరణ (పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. ప్రేరణ కూడా ప్రేమిస్తుంది. ఆమె ఒక డాక్టర్. పెదనాన్న చక్రవర్తి (సచిన్ ఖేడేకర్) కూడా డాక్టర్. వాళ్ళిద్దరూ జాతకాలను నమ్మరు. మరి, విక్రమాదిత్యను ఎలా నమ్మారు? ప్రేరణకు క్యాన్సర్. ఆమె మరణిస్తుందని వైద్యులు, బతుకుతుందని విక్రమాదిత్య చెబుతారు. ఎవరి మాట నిజం అయ్యింది? విధిని వీళ్ళ ప్రేమ జయించిందా? బలి అయ్యిందా? విక్రమాదిత్య, ప్రేరణ కలిశారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూస్తేనే అర్థమవుతుంది…

కథ ప్రారంభం..
సినిమా ప్రారంభమే ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభం అవుతుంది. అంటే 1976 లో అన్నమాట. నవంబర్ 1976 లో ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రారంభం అవుతుంది.

ఈ సినిమాలో హీరో ప్రభాస్ పేరు విక్రమాదిత్య. సత్యరాజ్ దగ్గర హస్తసాముద్రికం అనే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు. ఆయన వద్ద విద్యార్థిగా ఉంటాడు. ఆ తర్వాత ఇండియా నుంచి విక్రమాదిత్య ఫారెన్ కంట్రీకి వెళ్తాడు. అప్పుడే ఇందిరా గాంధీ.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటిస్తారని ఊహిస్తాడు. ఆ తర్వాత సంచారీ పాట వస్తుంది. విదేశాల్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఆ పాట ఉంటుంది.

విక్రమాదిత్య చాలా స్టయిలిష్ గా ఉంటాడు. విక్రమాదిత్య తల్లి భాగ్యశ్రీ. ట్రెయిన్ లో విక్రమాదిత్యకు పూజా హెగ్డే(ప్రేరణ) పరిచయం అవుతుంది. చూసి చూడంగానే విక్రమాదిత్య.. ప్రేరణ ప్రేమలో పడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట…

ఇక సెకండాఫ్ విభాగం పలు కమర్షియల్ ఎలిమెంట్స్ తో మొదలవగా ఊహించని ట్విస్ట్ తో ఆసక్తిని పెంచింది. ఈ ట్విస్ట్ తర్వాత వచ్చే సన్నవేశాలలో ఇరువురి నటినటులు బాగానే ఆకట్టుకున్నారు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలలో మాత్రం నటించారని చెప్పడంకన్నా జేవించేసారని చెప్పడం మంచిది. దీంతో ఈ సినిమా కి చివరి 30 నిమిషాలు చాలా ప్లస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ కొంతమేర బోర్ కొట్టినా సెకండ్ హాఫ్ తో మాత్రం దర్శకుడు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక విభాగానికి ఇప్పటికే పలు టాలీవుడ్ చిత్రాలకి పనిచేసిన ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు తన నైపుణ్యాన్ని చక్కగా చూపించారు. కానీ ల్యాగ్ సన్నివేశాలలో కట్ చెయ్యడంలో ఇంకొంచెం శ్రద్ధ వహించాల్సింది. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన మనోజ్ పరమహంస కూడా తన టేకింగ్ తో బాగానే ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్ర పాటల విషయానికొస్తే జస్టిన్ ప్రభాకరన్ తన మార్క్ ను కనబర్చారు. ఈ చిత్రంలోని ప్రతీ పాట కచ్చితంగా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇక బ్యాగ్రౌండ్ విషయానికొస్తే సంగీత దర్శకుడు తమన్ ఎక్కడ ఎంత కావాలో అంతే సౌండ్ ఉపయోగించాడు. ఓవరాల్ గా చూస్తే సాంకేతిక విభాగం కూడా బాగానే పని చేసిందని చెప్పవచ్చు..

ప్లస్ :
ప్రభాస్ యాక్టింగ్ మరియు స్టోరీ లైన్
విజువల్స్
మ్యూజిక్
చివరి 30 నిమిషాలు
మైనస్ :
స్లో నేరేషన్
ఫస్ట్ హాఫ్
కమర్షియల్ అంశాలు మిస్సింగ్….

రాధే శ్యామ్ – ప్రభాస్ అభిమానులకు మాత్రమే…కొంత నచ్చుతుంది….. సినిమా వీక్షకులకు మాత్రమ్ కొంత పర్వాలేదు అనిపిస్తుంది.