రాధేశ్యామ్ మూవీకి టిక్కెట్ రేట్లు పెరిగాయి…

ఏపీలో కొత్త సినిమా టికెట్ రేట్లు పెరిగాయి..

ఏపీలో ఈ మూవీ టిక్కెట్ రేట్లపై తొలుత సందిగ్ధత నెలకొంది. ఏపీలో 20 శాతం షూటింగ్ జరిపిన సినిమాలకే టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాధేశ్యామ్ షూటింగ్ 20 శాతం మేర జరపకపోవడంతో ఈ సినిమా టిక్కెట్ రేట్లపై ఎలాంటి నిర్ణయం వస్తుందో అని గురువారం సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో కూడా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం కాలేదు…ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాకు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది. ప్రీమియం టిక్కెట్ ధరపై రూ.25 పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ సినిమా బడ్జెట్ రూ.170 కోట్లుగా జీఎస్టీ ఇతర అకౌంట్ల బిల్లును యూవీ క్రియేషన్స్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. నటీనటుల రెమ్యూనరేషన్ కాకుండా రూ. 100 కోట్ల సినిమా నిర్మాణానికైతే టిక్కెట్ రేట్లను పెంచే వెసులుబాటు ఇస్తామని గతంలో స్వయంగా సీఎం జగన్ ప్రకటించగా.. ఆ మేరకు రాధేశ్యామ్ మూవీకి టిక్కెట్ రేట్లు పెరిగాయి. బుక్ మై షో, పేటీఎంలలో కూడా విక్రయాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని అన్ని మల్టీప్లెక్సుల్లో ఈ మూవీ టిక్కెట్ రూ.177గా ఉండగా.. రిక్లయినర్ సీట్ల ధర రూ.295గా ఉంది. గతంలో ఈ ధరలు రూ.150, రూ.250గా ఉండేవి…