ట్విట్టర్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని ఆట ఆడుకున్న నేటిజెన్లు..!!

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్టు ను పలు వురు వ్యతిరేకిస్తున్న సందర్భంలో అందులో భాగంగానే తెలుగు చిత్ర దర్శకేంద్రుడు రాఘవేందర్రావు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టడం జరిగింది అది క్రింద పేర్కొన్న అక్షరాలే..
ఇందులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను విగ్రహాలుగా సంబోధించడం కొందరికి మాత్రం నచ్చలేదు.. దీంతో నెట్జెన్లు అతని కామెంట్పై అడ్డగోలు వ్యాఖ్యల్ని పోస్ట్ చెయ్యడం జరిగింది..


అసలు పోస్ట్ ఇది..

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.

ఒక విజనరీ లీడర్ అయినటువంటి
నారా చంద్ర బాబు నాయుడు ని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం.

ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి..